మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉండేవాడు. కానీ గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్ లు రవితేజ ని వెంటాడుతున్నాయి. నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా ఇలా వరుసగా ఫ్లాప్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడట. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమాతో రమేష్ వర్మ హిట్ అందుకున్నాడు . ఆ సినిమా తమిళ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్ చిత్రం కాగా రవితేజతో రమేష్ వర్మ చేస్తోన్న చిత్రం కూడా రీమేక్ చిత్రమేనని సమాచారం. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయితే మరోటి బిజినెస్ మ్యాన్ పాత్ర అని సమాచారం.