ఏపీలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని సంతోషించే లోపే.. కరోనా వైరస్ పంజా విసిరింది. రాత్రికి రాత్రే ఏకంగా 43 కేసులు కొత్తగా నమోదు కావటంతో ఏపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయతే… ఇందులో ఎక్కువగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారికి కలిసి మొత్తం 373 శాంపిల్స్ టెస్టింగ్ కోసం పంపించగా… అందులో 43 కేసులు పాజిటివ్ వచ్చినట్లు ఏపీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87కు చేరింది.
కొత్తగా పాజిటివ్ వచ్చిన కేసులను జిల్లాల వారిగా చూస్తే… కర్నూల్ లో 15, కడపలో 15 కేసులు , పశ్చిమ గోదావరి లో 13 కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఇందులో కాంటాక్ట్ కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.