జమ్మూకాశ్మీర్ లోని 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సప్లయ్ చేసిన కేసులో భాగంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్ఐఏతోపాటు సీఆర్పీఎఫ్ బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ సోదాల్లో పాల్గొన్నారు.
నిషేధిత జమాతే ఇ ఇస్లామి సంస్థకు చెందిన సభ్యుల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. 2019లో పాకిస్థాన్ అనుకూల సంస్థ అయిన జమాతే ఇ ఇస్లామిపై కేంద్రం నిషేధం విధించింది. దాని తర్వాత ఆ సంస్థ సభ్యుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు అధికారులు.