సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బన్సీలాల్ పేట్ డివిజన్ బోయగూడలోని టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో అందులో మొత్తం 12 మంది కార్మికులు ఉన్నారు. ఓ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. మృతులంతా బీహార్ వాసులు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలను అదుపు చేశారు. తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
ఘటనా స్థలానికి ఏసీపీ వెంకట రెడ్డి, నార్త్ జోన్ అడిషనల్ డీజీపీ వెంకటేశ్వర్లుతో పాటు ఇతర పోలీసులు చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. డిపో మొత్తం టింబర్, స్క్రాప్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయని పోలీసులు తెలిపారు.
మంటలు.. పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ గోదాముకు కూడా వ్యాపించాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
మృతుల వివరాలు
సికిందర్(40), సత్యేందర్(35), దినేశ్(35), గోలు(28), దామోదర్(27), చింటు(27), దీపక్(26), పంకజ్(26), రాజేశ్(25), రాజేశ్(25), బిట్టు(23).