ముంబై : ముంబై సమీపంలోని ఓఎన్‌జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బంది మృతి చెందారు. కోల్డ్‌స్టోరేజీ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 50 ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు.