గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సిహోర్ పట్టణానికి సమీపంలోని అరిహంత్ ఫర్నేస్ రోలింగ్ మిల్ లో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
అకస్మాత్తుగా పేలుడు జరిగింది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు గాయాలపాలయ్యారని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను భావ్నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదానికి కారణం గోడౌన్లో తుక్కు పదార్ధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో 22 ఏళ్ల కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం అతడిని ముంబయికి తరలించినట్టు తెలుస్తోంది.