అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోం విభాగం స్టోర్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రాకాసి కీలలను తలపిస్తూ మంటలు స్థానికులను బెంబేలెత్తించాయి. మంటలను అదుపు చేసేందుకు ఏకంగా వంద ఫైర్ ఇంజన్ లు రంగంలోకి దించారు. అయినా మంటలను ఆర్పడానికి వశపడలేదని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో దక్షిణ సాన్ జోస్ ప్రాంతంలోని హోం విభాగం స్టోర్ లో ఎక్కువగా రసాయనాలు తయారు చేస్తారు. అందులో ఉన్నట్టుండి ఒక్క సారీగా మంటలు చెలరేగాయి. రసాయనాలు ఎక్కువగా ఉండటం కారణంగా ప్రమాద తీవ్రత ఎక్కువయింది.
ఈ మంటలను అదుపు చేసేందుకు ఏకంగా వంద ఫైర్ ఇంజన్ లను రంగంలోకి దించారు అధికారులు. తీవ్ర పొగమంచుతో కూడిన మంటలు చెలరేగి.. వేడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. ఈ మంటల ధాటికి దక్షిణ జోస్ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలముకుంది.
వాయు కాలుష్యం పెరగడం వల్ల స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు అధికారులు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని చెప్తున్నారు.