ఆచార్య రిలీజ్ డేట్ లాక్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ… ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు మూవీ బిజినెస్ కూడా క్లోజ్ చేసేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కాంబో కావటం పైగా సోషల్ యాంగిల్ తో మెస్మరైజ్ చేసే డై్రెక్టర్ కావటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
కీలకమైన నైజాంలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు చివరి వరకు ప్రయత్నించారు. దాదాపు 35కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. కానీ క్రాక్ సినిమా రిలీజ్ చేస్తూ… దిల్ రాజును కిల్ రాజు అంటూ విమర్శించిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను సినిమాను 42కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో ఉన్న మనస్పర్థలతో కారణంగా ఆయనకు సినిమా ఇచ్చేందుకు డైరెక్టర్ కొరటాల ముందునుండి ఇంట్రెస్ట్ గా లేడన్న టాక్ కూడా వినపడింది.
ఇక ఆంధ్ర, సీడెడ్ లో కనీసం 60కోట్ల బిజినెస్ టార్గెట్ చేశారట. అంటే మొత్తంగా ప్రి రిలీజ్ బిజినెస్ ఏకంగా 100కోట్లు దాటించే ప్రయత్నంలో ఉన్నారు.