మినిమం గ్యారెంటీ హిట్ తో సంవత్సరానికి కనీసం మూడు సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో నాని. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా శ్యామ్ సింగ రాయ్ తెరకెక్కుతోంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ప్లాన్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల పర్యవేక్షణలో ఏకంగా 15ఎకరాల్లో సెట్ వేస్తున్నారు.
ఈ 15 ఎకరాల సెట్ లో కలకత్తా వీధులు, కాళీ మాత గుడిని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ పనులు మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి నుండి ఈ సెట్ లో షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ మూవీలో నాని ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. హీరోయిన్లుగా సాయి పల్లవి, క్రితీ శెట్టి, మడొన్నా సెబాస్టియన్ లను ఎంపిక చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.