దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఉదయం 9.45 సమయంలో నిఫ్టీ 407 పాయింట్ల నష్టంతో 16,967 వద్ద, సెన్సెక్స్ 1,355 పాయింట్ల నష్టంతో 56,807 వద్ద ట్రేడవుతున్నాయి. అన్ని రంగాల సూచీలు చివరివరకు భారీ నష్టాల్లో కొనసాగింది.
అత్యధికంగా లోహ రంగ సూచీ పడిపోయింది. ఎక్సెల్ ఇండస్ట్రీస్,యూఫ్లెక్స్, సీక్వెంట్ సైంటిఫిక్, మహీంద్రా లైఫ్ స్పేస్, టీసీఎన్‌ఎస్ క్లోతింగ్ షేర్లు అత్యధిక లాభాల్లో ఉండగా.. మెట్రో పోలీస్ హెల్త్ కేర్, కేఆర్‌బీఎల్, జైన్ ఇరిగేషన్, అవంతి ఫీడ్స్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
ఐరోపా సమాఖ్యలో ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరగడం మార్కెట్లను భయపెడుతున్నాయి. ఏ క్షణమైనా రష్యా.. దాడి మొదలుపెట్టవచ్చనే అమెరికా హెచ్చరికలు భయాలను రేపుతున్నాయి. దీంతో అమెరికా మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడమే ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు పతనమని నిపుణులు చెప్తున్నారు.
అయితే.. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏకంగా 1,747 పాయింట్లు కోల్పోయి.. 56,405కి పడిపోయింది. నిఫ్టీ 531 పాయింట్లు పతనమై 16,842 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం టీసీఎస్ 1.05% మాత్రమే లాభపడింది. టాటా స్టీల్ -5.49%, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ -5.33%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -5.20%, ఐసీఐసీఐ బ్యాంక్ -5.20%, ఇండస్ ఇండ్ బ్యాంక్ -4.52% టాప్ లూజర్లుగా ఉన్నాయి.