కరోనా వైరస్ వ్యాప్తిపై మొదట్లో ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయి. చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చికెన్ తినేయడం కొన్ని రోజులు మానేయండి, ఆరోగ్యం కన్నా ఎక్కువ ఏది కాదంటూ ప్రచారం జరగడంతో…ఇది చికెన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో తెలంగాణలో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ ను ఉచితంగా అమ్మకానికి పెట్టారు. మరికొన్ని చోట్ల అయితే చికెన్ కిలో 40 రూపాయలునుంచి 50 రూపాయలకు మాత్రమే లభించింది. రికార్డు స్థాయిలో చికెన్ రెట్లు తగ్గినప్పటికీ కుడా చికెన్ ను తినడానికి మాత్రం మాంసాహార ప్రియులు మొగ్గు చూపలేదు. ఇక, కొంతమంది మాత్రం చికెన్ తినడంతో కరోనా ఎట్టి పరిస్థితుల్లో సోకదని భావించి చికెన్ ను ఎంచక్కా లాగించేశారు. చికెన్ తింటే కరోనా రాదనే విషయాన్నీ మంత్రి కేటీఅర్ కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ చికెన్ తినడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక చికెన్ ను తినేందుకు అనాసక్తి ప్రదర్శించడంతో మటన్ కు డిమాండ్ పెరిగింది.
ఇక, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో కరోనాపై నెలకొన్న అపోహాలను తొలగిస్తూ చికెన్ తినడడం ద్వార కరోనా సోకుతుందనేది అవాస్తవమని స్పష్టం చేశారు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో చికెన్, గుడ్డు తీసుకోవడం మంచిదని కుడా చెప్పారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా పడిపోయిన చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. అసలు అమ్మకాలే లేక చికెన్ ను ఫ్రీగా అమ్మేసిన చికెన్ వ్యాపారస్తులు సీఎం ప్రకటనతో చికెన్ రేట్లను పెంచేశారు. యాభై రూపాయలుగా ఉన్న చికెన్ ధర కిలో ఏకంగా 200 రూపాయలకు చేరడం విశేషం. అలాగే సీఎం ప్రకటనతో చికెన్ తోపాటు గుడ్లు, పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం చికెన్ ధర కిలో 200 ఉండగా..మటన్ కిలో ధర 700కు చేరింది.
ధర పెరగటమే కాదు… ఆదివారం కూడా కావటంతో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద జనం క్యూ కట్టారు.