లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మాస్టర్. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్ అయిన ఈ చిత్రం వసూళ్లు కూడా గట్టిగానే సాధిస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. ప్రైవేట్ డిజిటల్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి థియేటర్లలోకి రాకముందే మాస్టర్ ఈ చిత్రాన్ని లీక్ చేశాడు. అయితే ఆ వ్యక్తిపై నిర్మాతలు 25 కోట్ల రూపాయల దావా వేస్తున్నారట. ఇప్పటికే సదరు సంస్థకు లీక్ చేసిన వ్యక్తికి లీగల్ నోటీసులు పంపారట. అయితే ఇప్పుడు అన్ని కోట్లు వారు కడతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.