ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి, మిక్స్ టాక్ తెచ్చుకున్న సినిమా మాస్టర్. దళపతి విజయ్ నటించిన ఈ చిత్రం సౌత్ లోఇంపు మంచి వసూళ్లను రాబట్టింది. ఫైనాన్షియల్ గా మంచి ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మూవీ, ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు రెడీ అయ్యింది.
సినిమా విడుదలైన నెలకు డిజిటల్ లో రిలీజ్ చేయాలన్న కండిషన్ తో అమెజాన్ సంస్థ ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ చేయనుంది. డిజిటల్ రిలీజ్ కు ఉన్న గట్టి పోటీని తట్టుకొని అమెజాన్ సంస్థ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మొహాన్ ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కింది.