లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాస్టర్. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడిందనే చెప్పాలి. మొదట నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఒక్క తమిళనాడులోనే 550 పైగా స్క్రీన్స్, ప్రపంచ వ్యాప్తంగా 800 పై చిలుకు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం వసూళ్ళ పరంగా మోత మోగిస్తోంది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మాస్టర్ సినిమా కేవలం తమిళనాడు వరకే మూడు రోజుల్లో 50 కోట్లు వసూలు చేసిందట. ఇక ఈ ఆరు రోజుల కలెక్షన్లు చూస్తే 150కోట్ల మార్క్ దాటే ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి మాస్టర్ నిజంగా ట్రేడ్ వర్గాలు చెప్పినట్లు 150 కోట్ల మార్కును దాటిందో లేదో చూడాలి.