లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మాస్టర్ ఈ చిత్రం విడుదల కావాల్సిన ఈ చిత్రం కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే థియేటర్స్ లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో థియేటర్ లో ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో వార్తలు వస్తున్నాయి అభిమానుల కోరిక మేరకు ఈ సినిమా థియేటర్లు ప్రకటించింది అయితే తాజాగా మరోసారి క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ని రిలీజ్ చేశారు.
అందరం మహమ్మారితో పోరాడుతున్న వేళ.. అందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాము. మా చిత్రం మాస్టర్‌ని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు అర్థమవుతుంది. మీరంతా ఎలా వేచి చూస్తున్నారో.. అంతే ఎగ్జైట్‌మెంట్‌తో మేము కూడా ఆ రోజు కోసం వేచి చూస్తున్నాం. కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్‌పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టి.. మా స్టాండ్ ఏంటో తెలియజేయాలనుకుంటున్నాం. ఒక ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చింది.. కానీ మేము థియేటర్‌లోనే సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ కష్టకాలంలో ఇండస్ట్రీ తిరిగి నిలబడాలంటే అది చాలా అవసరం. అందుకే, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్లీ నిలదొక్కుకోవాలంటే.. థియేటర్స్ ఓనర్స్ కూడా మాకు సపోర్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. త్వరలోనే మంచి న్యూస్‌తో మీ ముందుకు వస్తాం. క్షేమంగా ఉండండి అంటూ లెటర్ లో పేర్కొంది.
#MasterPressRelease pic.twitter.com/qU0yCvXmQy
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 28, 2020