లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మాస్టర్. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ డేట్ ను ఫిక్స్ చేసిందట.
మరోవైపు విజయ్ కు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి క్రేజ్ ఉండటంతో అదే సమయంలో తెలుగులో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించిన నటించారు. విజయ్ సేతుపతికి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ కోసం మంచి పోటీ నెలకొంది.