ప్రపంచ వ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటు 20 ఏండ్లలో మూడో వంతుకు తగ్గిందని ఐక్య రాజ్యసమితి నివేదిక వెల్లడించింది. కానీ గర్భం లేదా ప్రసవ సమస్యల కారణంగా ప్రపంచంలో ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మరణించడం ఆందోళన కలిగిస్తోందని ఐక్య రాజ్యసమితి వెల్లడించింది.
2000-2015 మధ్య ప్రసూతి మరణాల రేటు గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. నివేదిక ప్రకారం…. 2016 నుంచి 2020 మధ్య ప్రసూతి మరణాల రేటు తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మరణా సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత 20 ఏండ్లలో మొత్తం ప్రసూతి మరణాల రేటు 34.3 శాతం తగ్గింది.
2000 సంవ్సతరంలో ప్రతి లక్ష జననాలకు 339 ప్రసూతి మరణాలు సంభవించగా, అది 2020 నాటికి 223కి తగ్గిపోయింది. అయినప్పటికీ 2020లో రోజుకు దాదాపు 800 మంది మహిళలు మరణించారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
బెలారస్‌లో ప్రసూతి మరణాల రేటు ఘననీయంగా తగ్గింది. దేశంలో ప్రసూతి మరణాల రేటు 95.5 శాతం తగ్గడం ఆనందించదగ్గ విషయమని తెలిపింది. ఐక్యరాజ్య సమితిలోని ఎనిమిదిలో రెండు ప్రాంతాల్లో మాత్రమే ప్రసూతి మరణాల రేటు తగ్గిందని పేర్కొంది. కేవలం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో మాత్రమే 35 శాతం తగ్గిందని పేర్కొంది.