ఆర్ఎస్ఎస్ పై ఓ ఆర్టికల్ లో అనుచిత పదాలను, సమాచారాన్ని ప్రచురించినందుకు కేరళలోని మాతృభూమి పత్రిక క్షమాపణ చెప్పింది. ”ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదం ఇండియాను మింగేస్తుందా?” అనే టైటిల్ తో గల ఓ ఆర్టికల్ ను ఈ పత్రిక ను ప్రచురించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పంచకుల చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు స్వామి అసీమానంద ఇచ్చిన స్టేట్ మెంట్ ల ఆధారంగా బద్రి రైనా అనే వ్యక్తి ఈ ఆర్టికల్ రాశారు. దీన్ని మాతృభూమి పత్రిక ప్రచురించింది.
అయితే ఇది అనుచితంగా ఉందంటూ.. ఎర్నాకులంలో పీ గోపాలం కుట్టి మాస్టర్ అనే వ్యక్తి అక్కడి కోర్టులో కేసు పెట్టారు. ఈ యన ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ నేత. 2013 మార్చి 19న అడ్వాకేట్ కేకే బలరాం కోర్టు ఆర్డర్ ను ఈ పత్రికకు పంపారు. అయితే స్వామి అసీమానంద స్టేట్ మెంట్ ఆయన స్వచ్ఛందంగా ఇచ్చింది కాదని.. అప్పటి యూపీఐ ప్రభుత్వం పన్నిన కుట్రల్లో భాగమని, ఈ ఆర్డర్ లో పేర్కొన్నారు.
హిందూ టెర్రరిజాన్ని ఇస్లామిక్ ఫండమెంటలిజంగా చూపేందుకు చేసిన కుట్ర ఫలితమే ఇదన్నారు. 2019లో సుప్రీం కోర్టు.. స్వామి అసీమానంద నుంచి బలవంతంగా స్టేట్ మెంట్స్ తీసుకున్నారంటూ ఆయనను నిర్దోషిగా విడిచి పెట్టింది. ఈ ఆర్టికల్ ను ప్రచురించిన మాతృభూమి పత్రిక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది.
తాము అధ్యయనం చేసాకే ఈ ఆర్టికల్ ను ప్రచురించామని పేర్కొంది. అయితే ఈ పత్రిక పై గోపాలం కుట్టి మాస్టర్ ఎర్నాకులం కోర్టులో కేసు పెట్టారు. తన న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. దీన్ని కొట్టి వేయాలని కోరుతూ మాతృభూమి పత్రిక కేరళ హైకోర్టుకు ఎక్కినప్పటికీ.. దాన్ని కోర్టు తిరస్కరించింది. దాంతో ఈ పత్రిక కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
కానీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్పిస్తూ ట్రయల్ కోర్టులో దీనిపై విచారణ కొనసాగించాలని ఆదేశించింది. దీంతో మాతృభూమి అపాలజీ చెప్పింది. కానీ ఎర్నాకులం కోర్టులో ఈ పత్రికపై కేసు ఇంకా నడుస్తోంది.