కొత్త దర్శకులు, కొత్త హీరోతో వచ్చిన మత్తు వదలరా సినిమా తెలుగు సినిమా మత్తును కాస్తంత వదలించే సినిమా అనుకోవచ్చు. సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ హీరోగా పరిచయమైన ఈ సినిమాకు రాజమౌళి కామెంట్స్ ప్రేక్షకులను థియేటర్స్ వరకు తీసుకెళ్లినా… సినిమా మాత్రం ఎక్కడా కొత్త వాళ్లది అన్నట్లు అనిపించకుండా పక్కగా తీశారు.
ముఖ్యంగా సత్య సినిమాను నిలబెట్టారని చెప్పుకోవచ్చు. తక్కువ జీతంతో ఇబ్బంది పడే హీరోకు సత్య ఇచ్చిన సలహా, అది పాటించే క్రమంలో హీరో ఎదుర్కొన్న ఇబ్బందులతో సినిమా తెలుగు సినిమాలకు కాస్త భిన్నంగా నడుస్తుంది. కానీ సెకండ్ ఆఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు ముందే గెస్ చేసేలా ఉండటం కాస్త మైనస్. కానీ ఓవరాల్ సినిమా పర్వాలేదనిపించగా… కమెడియన్ సత్యకు బెస్ట్ ఫిలిం అని చెప్పుకోవ్చు. ఇక కీరవాణి కొడుకుగా పరిచయమైన తన యాక్టింగ్‌తో మెప్పించాడు శ్రీసింహ.
వెంకీ ఎందుకు ఇలా చేస్తున్నాడు ?
ఓవరాల్‌గా క్రిస్మస్ సెలవుల్లో వినోదం కోసం చూడదగ్గ సినిమా- మత్తు వదలరా