మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. చిరంజీవి 152వ సినిమాపై మంచి అంచనాలుండటంతో పాటు ఈ సినిమాలో ఓ కీలక రోల్ లో రాంచరణ్ కానీ మహేష్ బాబు కానీ నటిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్ని మూవీ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాంచరణ్ ఒక్క పైసా ఖర్చు చేయటం లేదని, కానీ 50శాతం లాభాలు తీసుకోబోతున్నాడని ప్రచారం సాగింది.
దీనిపై స్పందించిన మ్యాట్నీ మూవీ సంస్థ నిరంజన్ రెడ్డి… ఈ వార్తల్లో నిజం లేదని, తాము ముందుగానే అనుకున్న ప్రకారం అంతా జరుగుతుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం మూవీ షూటింగ్ వాయిదా పడిందని, షెడ్యూల్ ప్రకారమే సినిమా విడుదలకు కృషి చేస్తామని స్పష్టం చేశాడు.