విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మట్టి కుస్తీ. విష్ణు విశాల్, రవితేజ కలిసి నిర్మించారు. దీనికి మొదటి రోజు మంచి టాక్ వచ్చింది. రెండో రోజు కూడా బాగానే నిలబడింది. కానీ ఆక్యుపెన్సీ మాత్రం తగ్గిపోతుంది.
సక్సెస్ టాక్ వచ్చినా ఆక్యుపెన్సీ తగ్గడానికి కారణం ఇందులో స్టార్ ఎట్రాక్షన్, నేటివిటీ మిస్సవ్వడమే. ఇవి లేకపోయినా ఒక్కోసారి సినిమాలు క్లిక్ అవుతాయి. దీనికంటే ముందొచ్చిన లవ్ టుడే, మసూద దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. కానీ మట్టి కుస్తీ మాత్రం నిలదొక్కుకోలేకపోతోంది.
రిలీజైన 2 రోజుల్లో ఈ సినిమాకు 90 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా కోటి 70 లక్షల రూపాయల వసూళ్లు రావాల్సి ఉంది.
ఓవైపు హిట్-2 సినిమా పెద్ద హిట్టయింది. మరోవైపు లవ్ టుడే, మసూద సినిమాలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో మట్టి కుస్తీ కోలుకోవడం కష్టం అంటోంది ట్రేడ్.