పోలవరం రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వ సొమ్ము ఆదా
పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజీకి టెండర్ ఖరారు
15.6 శాతం తక్కువకి టెండర్ వేసిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా
చంద్రబాబు హయాంలో 4.8 శాతం అదనంగా టెండర్ దాఖలు చేసిన ఇదే సంస్ధ
రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వానికి రూ.58 కోట్లు ఆదా
టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.292.02 కోట్లకు పనులు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ ఫ్రా
ఇప్పుడు 231.47 కోట్లకు టెండర్ ఖరారు
గుంటూరు: రివర్స్ టెండరింగ్ సర్కారు ఊహించిన ఫలితాలనే ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్టులోని 65 ప్యాకేజి పనికి టెండర్ పిలవగా, అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు.. అంటే మొత్తం పని విలువలో రూ.43 కోట్ల తక్కువకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా ఎల్-1గా బిడ్ దాఖలు చేసినట్టుగా తెలిసింది. పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజీ టెండర్ ఖరారైంది. టీడీపీ హయాంలో 65వ ప్యాకేజీ పనులను రూ. 292.09 కోట్లకు పనులు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ తాజాగా రూ. 231.47 కోట్లకు టెండర్ దక్కించుకుంది. బిడ్‌లో ఆరు కంపెనీలు పోటీపడగా.. 15.6 శాతం తక్కువకి మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ టెండర్ వేసింది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే సంస్థ కేవలం 4.8 శాతం ఎక్కువకి టెండర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వానికి రూ. 58.53కోట్లు ఆదా కానుంది.