మనీలాండరింగ్ కేసులో ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఈడీకి సహకరించాలని ఆయన్ని సోమవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
దీంతోపాటు కేసు విచారణపై ఇచ్చిన స్టేను కూడా హైకోర్టు ఎత్తి వేసింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఈడీ కార్యాలయానికి వెళ్లారు. బంగారం వ్యాపారులకు మినరల్స్, మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎంఎంటీసీ) రాయితీపై బంగారాన్ని ఇస్తుంది.
సౌకర్యాన్ని వినియోగించుకుని ఎంబీఎస్ జ్యువెలర్స్ భారీగా బంగారాన్ని అప్పుగా తీసుకుంది. సుమారు రూ.500 కోట్ల విలువ చేసే బంగారు వజ్రాభరణాలను కొనుగోలు చేసింది. కానీ, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సంస్థకు డబ్బులను తిరిగి చెల్లించలేదు. దీంతో ఎంఎంటీసీ అధికారులు సీబీఐని ఆశ్రయించారు.
తో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంఎంటీసీలోని కొంతమంది అధికారులు సహకరించడంతోనే సుఖేష్ గుప్తా మోసానికి పాల్పడినట్లు దర్యాప్తు సమయంలో సీబీఐ గుర్తించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇందులో ఆర్థిక నేరం కావడంతో అటు ఈడీ కూడా ఎంటర్ అయింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. గతేడాది అక్టోబర్ లో ఎర్రమంజిల్ లోని ముసద్దీలాల్ జేమ్స్ అండ్ జ్యువెలర్స్ తో పాటు సికింద్రాబాద్, విజయవాడలోని బ్రాంచుల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రూ.50 కోట్ల ఆస్తులను కూడా ఈడీ సీజ్ చేసింది.