దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. తూర్పు ఢిల్లీలో ఓ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతని పై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం…
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని పాఠశాలలో 2016 నుంచి సదరు క్రీడా ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. గత వారం చిన్నారిని ఆ వ్యక్తి ప్రలోభపెట్టాడు. పాఠశాలలోని ఏకాంత ప్రదేశానికి చిన్నారిని తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెను లైంగిక దాడి చేశాడు.
చిన్నారి ప్రవర్తనపై అనుమానం రావడంతో జరిగిన విషయంపై ఆరా తీసింది. జరిగిన విషయాన్ని ఎనిమిదేళ్ల చిన్నారి తన తల్లికి వివరించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నాలుగైదు రోజుల క్రితం దీనిపై తమకు కాల్ వచ్చిందని డీఎస్పీ అమృత గుగులోత్ తెలిపారు.
ఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపించామని డీసీపీ అమృత చెప్పారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ చేశామన్నారు. ఆ ఉపాధ్యాయుడిపై ఐపీసీ సెక్షన్ 376, 506, పోక్సో చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.