ఎంఐఎం శాసనసభాపక్ష నేత, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్ధీన్‌పై దాడి చేసిన మహ్మద్ పహిల్వాన్ మృతి చెందారు. అదే ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న మహమ్మద్ పహిల్వాన్‌కు గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.
8 సంవత్సరాల క్రితం అక్బర్‌పై దాడి చేసిన కేసులో అరెస్టయ్యారు మహమ్మద్ పహిల్వాన్. 2011లో భూతగాదాలతో అక్బర్‌పై పహిల్వాన్ అనుచరులు దాడి చేసినట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు.