బంగారు తెలంగాణలో కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లుగా తయారైంది. మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి.
సర్వే నెంబర్ 647లోని భూమి ప్రభుత్వానిదని గతంలో బోర్డు ఏర్పాటు చేశారు రెవెన్యూ అధికారులు. అయితే కొందరు కబ్జారాయుళ్లు ఆ బోర్డును తొలగించి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. జరుగుతున్న వ్యవహారంపై కొంతమంది స్థానికులు సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మార్వో అనిత, ఆర్ఐ రమేష్ తమ సిబ్బందితో వచ్చి మళ్లీ ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు.
సర్కార్ భూముల్ని వెంచర్లుగా మార్చి అమ్మే కబ్జాదారులపై మండిపడ్డారు అధికారులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.