ఉద్యమ సమయం నుండి పార్టీలో ఉండి, పార్టీ కోసమే పనిచేస్తుంటే… ఉద్యమ నాయకులకు పార్టీ అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ విజయ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మేడ్చల్ మున్సిపాలిటీ 14వ వార్డు నుండి బరిలో ఉన్న విజయ్ చివరి క్షణం వరకు పార్టీ బీ-ఫామ్ వస్తుందని ఆశించారు. కానీ చివరి నిమిషంలో తనకు పార్టీ బీ-ఫామ్ నిరాకరించటంతో మేడ్చల్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయటంతో స్థానికులు కాపాడారు.
బీ-ఫామ్ అడిగితే పార్టీ నేతలు 25లక్షల డిపాజిట్ చూపించమంటున్నారని, డబ్బులుంటేనే పార్టీ టికెట్ వస్తుందని చెబుతున్నారని ఆరోపించాడు విజయ్. దళితుడైన తను ఉద్యమం నుండి పార్టీ కోసమే పనిచేస్తుంటే ఇప్పుడు డబ్బులుంటేనే టికెట్ ఇస్తామనటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నాడు.