మూగబోయిన మీడియా..! - Tolivelugu

మూగబోయిన మీడియా..!

media channels pays silence in rtc employees issue, మూగబోయిన మీడియా..!

అక్షరం, కలం, గళం మనిషిని మనిషిగా చేస్తాయి, జీవితాన్ని నేర్పుతాయి, పోరాటం నేర్పుతాయి✊

కానీ….నేడు ఇక్కడ ఇప్పుడు అవి మూగబోయాయి..!😷😓😢

ఇక్కడ ఆర్టీసీ కార్మికులు వాళ్ళ హక్కులకోసం ప్రజాస్వామికంగా పోరాడుతూ నిన్న నగరంలో అన్ని రాజకీయ పక్షాల మద్దత్తుతో జరుపుకున్న అత్యంత పెద్ద బహిరంగసభ వార్తల్ని,

అక్కడ ఇసుక కొరతతో రోడ్డునపడ్డ భవనకార్మికుల వెతల్ని, ప్రభుత్వ కార్యాలయాలకు (చివరకు జాతీయ పతాకానికి కూడా) రంగులు మారుస్తూ, అధికారపక్షం మారణకాండ సృష్టిస్తుంటే ఆవార్తల్ని ప్రసారంచేయలేని “నపుంసక బానిస వ్యభిచార కిరాయి తెలుగు మీడియా”.!

వ్యభిచారగృహాల మీద,
వ్యభిచారగృహాలు నడిపే వ్యక్తుల మీదా,
వ్యభిచారంచేసే వారి మీదా,
విటులు మీదా దాడులుచేస్తూ వారిమీద కేసులు పెడుతూ వాళ్ళని కోర్టులకు హాజరుపెట్టే పోలీసు వ్యవస్థ..,
వార్తావ్యభిచారం చేస్తున్న మీడియా సంస్థల మీదా, కిరాయి వార్తలను ప్రసారంచేస్తున్న వార్తావ్యభిచార చానెళ్లు మీదా దాడులుచేసి కేసులుపెట్టి కోర్టుల్లో ఎందుకు హాజరుపరచదు…?

నిజాన్ని నిర్భయంగా చెప్పలేని వీళ్ళకంటే, పొట్టకూటి కోసం నిజాయితీగా తమ వళ్ళు అమ్ముకునే వాళ్లే మెరుగు కదా…!

వాళ్ళు పాపం తమ జానెడు పొట్టకూటికోసం, వాళ్ళ కుటుంబాలకు గుప్పెడు మెతుకులు పెట్టడం కోసం గత్యంతరంలేని పరిస్థితులలో మాత్రమేతమ వళ్ళు అమ్ముకుంటున్నారు, కానీ… రకరకాల అక్రమ మార్గాలలో అన్యాయంగా అవినీతితో సంఘవ్యతిరేక పనులతో కోటీశ్వరులైన వీళ్ళు పవిత్రమైన జర్నలిజం రంగంలోకి వచ్చి చానెళ్లు పత్రికలు పెట్టి, అవకాశవాదంతో అధికారానికి డబ్బులకు అమ్ముడుబోతూ నిస్సిగ్గుగా సమాజాన్ని కిరాయి వార్తావ్యభిచారంతో సర్వనాశనం చేస్తూన్నారు. వీళ్లు నేడు దేశంలో తీవ్రవాదులకంటే అత్యంత ప్రమాదాకారులు కాదా…?

మెజారిటీ ఈ సంస్థల్లో పనిచేస్తున్న మెజారిటీ సిబ్బందికి, విధివశాత్తూ రెడ్ లైట్ ఏరియాలో చిక్కుకున్న మహిళలకు పెద్దగా తేడా ఏమీలేనట్లే.!

పాపం, వాళ్లకు కడుపుతిప్పలు తప్పవు కదా మరీ….!

Share on facebook
Share on twitter
Share on whatsapp