మీడియా లెజెండ్ రవిప్రకాశ్ జైలు నుండి విడుదలయ్యారు. ఓ కేసులో బెయిల్ రాగనే మరో కేసులో అరెస్ట్ చేస్తూ… బయటకు రాకుండా చేసిన ఎత్తులు చిత్తాయ్యాయి. హైకోర్టు ఆదేశానుసారం మియాపూర్ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయటంతో రవిప్రకాశ్ విడుదలయ్యారు.
జర్నలిస్ట్ సంఘాల నాయకులు, సన్నిహితులు రవిప్రకాశ్‌కు స్వాగతం పలికారు. కార్పోరేట్ల ఎత్తులు చిత్తయ్యాయని, ఇక నుండి ప్రజా గొంతుక మరింత పెద్దదిగా… ప్రజల కోసం తన వాయిస్ వినిపిస్తుందని అభిప్రాయపడ్డారు జర్నలిస్టులు.