మీడియా నిరసన - Tolivelugu

మీడియా నిరసన

అధికార పక్షం, ప్రతిపక్షం అంతా బాగానే వుంటారు. మధ్యలో మీడియా వాళ్లు ఏం పాపం చేశారు? వాళ్ల విధులు వాళ్లని చేసుకోనివ్వరా ? సమయానికి సమాచారం ఇవ్వకపోతే వాళ్ల యాజమాన్యాలు ఊరుకుంటాయా ? తిండీ తిప్పలు లేకుండా రాత్రింబవళ్లూ పడి కూర్చుంటే మీడియాపై ఏంటి ఈ పోలీస్ జులుం ?

గుంటూరు : చంద్రబాబు నివాసం ఎదుట మీడియా ప్రతినిధులు ఆందోళనలకు దిగారు. మీడియా పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనకు నిరసనగా మీడియా ప్రతినిధులు అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ‘ఛలో ఆత్మకూరు’ కవరేజ్ కోసం వారంతే తెల్లవారు జామునే ఉండవల్లి కరకట్ట పక్కన వున్న చంద్రబాబు నివాసం దగ్గరికి వచ్చారు. అప్పటి నుంచి పడిగాపులు పడుతున్నారు. లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవాలని మీడియా ప్రతినిధులుగా వారికి వుండదా మరి? అదీగాక చంద్రబాబు మీడియా ద్వారా ప్రజానీకానికి చెప్పాల్సింది ఏదైనా వున్నా అది కూడా పాత్రికేయులే కదా అందివ్వాలి. ఇదంతా చెప్పి ఉదయం నుంచి అడుగుతూనే వున్నా మీడియా వాళ్లెవ్వరినీ లోపలికి పంపించకుండా చంద్రబాబు నివాసానికి కొద్ది దూరంలోనే వారిని నిలిపివేశారు. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించాలని ఓపక్కచంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ చెబుతున్నా కూడా పోలీసులు లక్ష్య పెట్టకుండా వాళ్లని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుగా నిలిచారు. దీంతో మీడియా బృందమంతా అక్కడే బైఠాయించి పోలీసుల ప్రవర్తన పట్ల తమ నిరసన తెలియజేశారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp