హైదరాబాద్: తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి దక్కాలని ఇద్దరు మీడియా అధిపతులు కూడబలుక్కున్నారు. ఇంకేముంది…తమ టీవీలలో తుమ్మలకు మంత్రివర్గ విస్తరణలో పదవి ఖరారైయిందని ఊదరగొట్టేశారు. ఒక మీడియా అధినేత పెద్ద సారును కూడా కలిసి, తుమ్మలకు కుర్చీ ఇస్తే సామాజిక వర్గ న్యాయం ఎంత బాగా చెయ్యొచ్చోనని సవివరంగా చెప్పారు. వారు నామ నాగేశ్వరరావుతో మాట్లాడి ఒత్తిడి తీసుకొని రమ్మని బ్రతిమిలాడారట. కానీ సారు వీళ్ళ గోల పట్టించుకోకుండా పువ్వాడ అజయ్‌ను ఎంచుకున్నారు.
అజయ్‌కు మంత్రి పదవి దక్కడం ఈ మీడియా పెద్దలిరువురికీ మింగుడు పడటం లేదు. వాళ్లిద్దరూ తనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చెయ్యడం అజయ్ బాబుకు నచ్చలేదు. సమర్ధించిన సన్నిహితులకు ధన్యవాదాలు చెబుతూ, వీరిరువురి సంగతి సరైన సమయంలో చూస్తానని వ్యాఖ్యానిస్తునట్టు సమాచారం.