ఉక్రయిన్ లో చిక్కుకున్న తెలుగువారు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మెడిసిన్ విద్యార్థినిలు సుష్మా, సుదర్శనలు మధురపూడి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ ఇద్దరినీ కూడా ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకున్నారు కుటుంబసభ్యులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉక్రయిన్ వెస్ట్రన్ లో ఉంటున్నామని అక్కడ యుద్ధ ప్రభావం అంతగా లేదని తెలిపారు. ఈస్ట్రన్ ఉక్రయిన్ లో యుధ్ధం తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. మా యునివర్సిటీ రుమేనియా బోర్డర్ కు దగ్గర ఉండటంతో త్వరగా రాగలిగామని చెప్పుకొచ్చారు.
ఇంకా 15 వేల మందికి పైగా భారతీయ విద్యార్ధులు ఉక్రయిన్ లో ఉండిపోయారని అన్నారు. సైరెన్ మోగినప్పుడు మెట్రో స్టేషన్, బంకర్స్ లో తలదాచుకున్నామని, అక్కడ పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్పారు.
ఉక్రయిన్ లో చిక్కుక్కున్న విద్యార్ధులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు వేగంగా జరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు మరువలేమని అన్నారు.