ఆర్డరిచ్చిన ఫుడ్డులో పురుగులొస్తే.. వామ్మో.. వాంతి చేసుకోవాల్సిందే. ఆ మధ్య సీనియర్ నటి ఖుష్బుకి ఇలాంటి బ్యాడ్ ఎక్సపీరియెన్సే ఎదురైంది. ఇప్పుడు మీరాచోప్రా వంతు..! వానా.. బంగారం.. సినిమాల్లో హీరోయిన్ మీరా గుర్తుందిగా.. ఆ మీరా చోప్రాకే ఇప్పుడు ఓ వింత, వికారమైన అనుభవం ఎదురైంది. మీరా ఓ హోటల్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో పురుగులు వచ్చాయి. దీంతో హోటల్ మేనేజ్మెంట్‌ను చెడామడా తిట్టేసింది మీరా. అంతటితో ఆగకుండా ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి చెబుతూ మీరా… ‘డబుల్ ట్రీ అనే హోటల్‌కు వెళ్లా. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశా.. అందులో తెల్లటి పురుగులు కనిపించాయి. డబ్బులు బాగా గుంజి నాకు ఇలాంటి పురుగులున్న ఫుడ్ పెట్టారు. ఇది చూసి షాకయ్యా.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వెంటనే దీనిపై యాక్షన్ తీసుకోవాలి’ అంటోంది. ప్రస్తుతం ఈ భామ ‘సెక్షన్ 375’ అనే చిత్రంలో నటిస్తోంది. అజయ్ భట్ ఈ మూవీకి దర్శకత్వం చేస్తున్నారు.