స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇటీవల అఖండ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. అయితే ఇప్పుడు కొత్త సినిమా ను అతి త్వరలో ప్రారంభించాలని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే యంగ్ హీరో రామ్ పోతినేనికి కథ చెప్పగా రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఇక ఇందులో నటి మీరా జాస్మిన్ నటించనుందట. అంతే కాదు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కోసం హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
దర్శకుడు బోయపాటి కూడా ఆమె స్పైసీ లుక్స్‌కి మంత్రముగ్ధుడయ్యాడట. గతంలో రవితేజతో కలిసి బోయపాటి చేసిన తొలి చిత్రం భద్రలో హీరోయిన్ గా మీరా జాస్మిన్ నటించింది.
ఈ కారణం తోనే బోయపాటి రిక్వెస్ట్ ను యాక్సప్ట్ చేసిందట. మరి బోయపాటి శ్రీను ఆమెతో ఎలాంటి పాత్ర వేయిస్తాడో చూడాలి.