తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు ఒకరు అర్థరాత్రి మీర్ పేటలో వీరంగం సృష్టించాడు. మీర్ పేట్ కార్పొరేటర్ అరుణ భర్త జిల్లెల ప్రభాకర్ రెడ్డి సోమవారం రాత్రి 10 గంటల తరువాత బండి మీద వెళ్తున్న బలరాం అనే వ్యక్తిని కారుతో ఢీ కొట్టాడు.
అంతేకాకుండా బలరాం బండి మీద ఉన్న మరో వ్యక్తి పై కూడా దాడి చేశాడు. ఈ దృశ్యాలు అన్ని కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఈ ఘటన గురించి బాధితుడు బలరాం వెంటనే మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బలరాం తన వాహనానికి అడ్డుకుని తనపై దాడికి యత్నించాడని.. కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. ప్రభాకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.