టాలీవుడ్ క్రేజీ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆది పురుష్’. ఈ మధ్యే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. ఈ టీజర్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్స్‌కి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ మూవీలోని హనుమంతుడిగా నటించింది ఎవరా? అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామాయణంలో కూడా హనుమంతుడి పాత్ర ఎంతో కీలకం. రామ, సీతలను కలిపేది ఆయనే కాబట్టి.
ఇప్పుడు ఆది పురుష్ లో హనుమంతుడి పాత్ర చేసింది ఎవరా? అని ఫ్యాన్స్ లో ఎంతో కుతూహలం పెరిగింది. ఇక ఇప్పటివరకు కేవలం ప్రధాన పాత్రలను మాత్రమే పరిచయం చేసిన డైరెక్టర్ ఓం రౌత్ హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ప్రకటించ లేదు. దీంతో ఆ రోల్ ప్లే చేసింది ఎవరనే దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది. హనుమంతుడి పాత్రలో నటించిన అతడి పేరు దేవదత్త గజాసన్ నాగే.
ఇంతకుముందు వరకు దేవదత్త మరాఠీ సీరియల్స్, సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జై మల్హర్ సీరియల్ లో కండోబా పాత్రలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యాడు. వీర్ శివాజీ, దేవయాని, బాజీరావ్ మస్తానీ వంటి మూవీల్లోనూ నటించాడు. గతంలో డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన తాన్హాజీ, ది అన్ సంగ్ వారియర్ మూవీలో సూర్యాజీ మలుసరే పాత్రలో యాక్ట్ చేశాడు.
ఇక పోతే దేవదత్త 17 సంవత్సరాల వయసులోనే వ్యాయామశాలని ఏర్పాటు చేశారు. ఆ వ్యాయామాసాలకు హనుమాన్ వ్యాయామశాల అని పేరు పెట్టారు. హనుమంతుడు అంటే ఎంతో భక్తి అని దేవదత్త పేర్కొన్నాడు. అయితే ఇంత భక్తి భావం కలిగినటువంటి దేవదత్తకు.. హనుమంతుడి పాత్రలో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.