మరో రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ జోడో యాత్ర రానున్నారు.ఆ సందర్భంగా ఈరోజు మహబూబు్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం నిర్వహించారు.
మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కాగా మహిళలను సమాయత్తం చేయటంలో కానీ.. పలు రకాల కమిటీలను ఏర్పాటు చేయడంలో గాని జిల్లా కాంగ్రెస్ విఫలమైందంటూ సునీతా రావు అసహనం వ్యక్తం చేశారు.
దీంతో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనిత రెడ్డి ఏడ్చుకుంటూ సభ నుంచి బయటికి వచ్చారు.. ఇది గమనించిన ఓ కాంగ్రెస్ నాయకుడు మీటింగ్ హాల్ లోకి దూసుకు వెళ్లి సునీతారావు పై తిట్ల దండకం అందుకున్నాడు.. సదరు వ్యక్తి.. రాష్ట్ర కాంగ్రెస్ మహిళ ఉపాధ్యక్షురాలు మాధవి కార్ డ్రైవర్ గా తెలిసింది.. అయితే మహిళల సమావేశంలో ఇలా వచ్చి అసభ్యంగా మాట్లాడినందుకుగాను అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా.. సునీతా రావు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇందిరా భవన్ లో….
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తావించాల్సిన అంశాలు, సమస్యలపై ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అధ్యక్షతన ఈరోజు గాంధీ భవన్ లోని ఇందిరా భవన్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మధు యాష్కీ గౌడ్ తో పాటు ప్రముఖ సామాజిక ఉద్యమ కారుడు యోగేంద్ర యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పుల రాజు, సారా మ్యాథ్యూస్, అంబాసడర్ వినోద్ కుమార్, ప్రొఫెసర్ సూసి ఖాన్, ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, ప్రొఫెసర్ పద్మజ, డాక్టర్ ఆర్ అఖిలేశ్వరి, అడ్వకేట్ ఆఫ్సర్ జహన్, కన్నెగంటి రవి, మొక్కపాటి సుమతి, అంకురం సుమిత్ర, నమ్రత జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.