మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఎంగెజ్మెంట్ పూర్తయింది. అతికొద్ది మంది సన్నిహితుల నడుమ పోలీస్ ఆఫీసర్ కొడుకు చైతన్య జొన్నలగడ్డతో ఎంగెజ్మెంట్ జరిపించారు. కరోనా కారణంగా అతికొద్దిమంది సన్నిహితులే హజరు కాగా, ఎంగెజ్మెంట్ పూర్తి కాగానే నాగబాబు, వరుణ్ తేజ్ లు వెరైటీ ట్వీట్ చేశారు.
ముఖ్యంగా నాగబాబు కూతురుపై సెటైర్స్ వేశారు. డియర్ చై… తను కూడా అన్ని విషయాల్లో అచ్చం నీలాగే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా నువ్వు తనపై కురిపిస్తావని నమ్ముతున్నా. ఈ రోజు నుండి తను అధికారికంగా నీ సమస్యగా మారిపోయిందంటూ ప్రేమతో చమత్కరించాడు.
ఇటు వరుణ్ తేజ్ సైతం ఈరోజు నాబేబీ సిస్టర్ ఎంగెజ్మెంట్ జరిగింది. కుటుంబంలోకి స్వాగతం బావా…. అంటూ సింపుల్ గా చైతన్యకు వెల్ కమ్ చెప్పాడు.