గాంధీపై మెగా బ్ర‌ద‌ర్ మ‌రో సెన్సెష‌న‌ల్ ట్వీట్- వైర‌ల్ - Tolivelugu

గాంధీపై మెగా బ్ర‌ద‌ర్ మ‌రో సెన్సెష‌న‌ల్ ట్వీట్- వైర‌ల్

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇప్ప‌టికే గాడ్సే ట్వీట్ తో వార్త‌ల్లో నిలిచారు. గాడ్సే కూడా దేశ‌భ‌క్తుడే అనటంతో ప‌లువురు నాగ‌బాబుపై మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేత‌లైతే కేసులు పెట్టారు. అయినా నాగ‌బాబు మాత్రం వెన‌క్కి త‌గ్గలేదు.

తాజాగా నాగబాబు గాంధీపై చేసిన మ‌రో ట్వీట్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దేశంలోని కరెన్సీ నోట్ల‌పై గాంధీ గారి ఫోటో ఒక్క‌టే ఎందుకు ఉండాలి…? అంటూ కొత్త ట్వీట్ చేశాడు. నాగ‌బాబు ట్వీట్ లో…..ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అంటూ ట్వీట్ చేశాడు.

వ‌రుస‌గా నాగబాబు గాంధీ ట్వీట్స్ సంచ‌ల‌నం అవుతుండ‌గా… తాజా ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

 

Share on facebook
Share on twitter
Share on whatsapp