నాగబాబు జబర్దస్త్ కామెడి షోలో రీఎంట్రీ ఇవ్వనున్నారా…?మళ్ళీ ఆయనను జబర్దస్త్ జడ్జిగా చూడనున్నామా..? మెగా బ్రదర్ ఎంట్రీని మల్లెమాల ప్రొడక్షన్ అంగీకరిస్తుందా…?ఆయనను తీసుకొచ్చేందుకు తెర వెనక ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా..?అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
నాగబాబు జబర్దస్త్ కామెడి షో వీడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. జబర్దస్త్ తో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవడం జబర్దస్త్ ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. ఇక, ఆయన జబర్దస్త్ నుంచి జీ తెలుగులో ప్రసారం అవుతోన్న అదిరింది షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనతోపాటు చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు అదిరింది షోలోకి మకాం మార్చారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే… నాగబాబును గాడ్ ఫాదర్ ను చెప్పుకునే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లు మాత్రం జబర్దస్త్ లోనే ఉండిపోవడం చాలామందిని ఆలోచనలో పడేసింది. నాగబాబును ఎక్కువగా అభిమానించే ఈ ఇద్దరు జబర్దస్త్ లో ఉండటమేంటనే చర్చ నడిచింది. మెగా ఫ్యామిలీని ఎవరైనా ఏమైనా అంటే అంతేతున్న లేచే హైపర్ ఆది సైతం జబర్దస్త్ లోనే ఉండిపోయాడు. అయితే దీనిపై ఇద్దరు స్పందిస్తూ.. తమకు నాగబాబు గాడ్ ఫాదర్ అయినప్పటికీ తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ లోనే ఉంటామని స్పష్టం చేశారు. అయితే అసలు విషయం వేరే ఉంది. నాగబాబు స్వయంగా వారిద్దరిని జబర్దస్త్ లోనే ఉన్నమన్నాడట. తాజాగా వీళ్లిద్దరితోనే మల్లెమాల వాళ్లతో నాగబాబు రాయబారం నడుపుతున్నట్టు సమాచారాం.
అలకలు, ఆహ్వానాలు సినీ ఇండస్ట్రీలో కాని, రాజకీయంలో కాని సర్వసాధారణమన్నట్లుగా ఇప్పుడు నాగబాబును కుడా జబర్దస్త్ లోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లు ఇద్దరు నాగబాబును తిరిగి జబర్దస్త్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మెగా బ్రదర్ మరలా జబర్దస్త్ షోలోకి వస్తానంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని జబర్దస్త్ నిర్వహణ సంస్థ మల్లెమాల ప్రొడక్షన్ తేల్చిచెప్పిందట. కాగా, ప్రస్తుతం నాగబాబు జీ తెలుగులో ప్రసారం అవుతోన్న అదిరింది షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన అదిరింది షో యాజమాన్యంతో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం ఇంకా ఏడాదిపాటు నాగబాబు అదిరింది షోకు జడ్జిగా చేయాల్సిందే. ఆ తరువాత నాగబాబు కాంట్రాక్ట్ ముగిసిన అనంతరం ఆయనను జబర్దస్త్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో హైపర్ ఆది, సుడిగాలిసుధీర్ లు ఎంతమేరకు విజయం సాధిస్తారో చూడాలి..