జబర్దస్త్- అదిరింది షోల మధ్య వార్ ముదురుతోంది. అదిరింది షో రెండు వారాలు ప్రసారం అయి మూడో వారం ప్రోమో కూడా రిలీజ్ చేయగా… నాగబాబు ఆయన షోలే టార్గెట్‌గా మల్లెమాల దాడిని ఉదృతం చేసినట్లు కనపడుతోంది.
జబర్ధస్త్ జిరాక్స్ షో అన్నట్లుగా వచ్చిన అదిరింది కామెడీ షో ఆదివారం ప్రసారం అవుతోంది. కానీ అదే సమయంలో ఈటీవీ కూడా అదిరింది షోను టార్గెట్ చేస్తూ… నాగబాబు, ఆయనతో వెళ్లిన మంచి హిట్ స్కిట్స్‌ను ప్లే చేస్తోంది. కనీసం యాడ్స్ కూడా లేకుండా, హిట్ స్కిట్స్ వేస్తుండటంతో అదిరింది షోకు జబర్దస్త్ షో సవాలు విసురుతోంది. దీంతో అప్పటి వరకు కామ్‌గా ఉన్న నాగబాబు కోపంతో తాము పోటీగా భావించకపోయినా మమ్మల్ని టార్గెట్ చేశారు కాబట్టి మేము కూడా గురు, శుక్రవారాల్లో ప్రసారం చేస్తాం అంటూ పోటీని తీవ్రతరం చేశాడు.
అదిరింది షోలో జబర్ధస్త్‌ను టార్గెట్ చేస్తూ పంచ్‌లు వేస్తుండటం, జబర్ధస్త్ కూడా అదిరింది షోపై పంచ్‌లు గట్టిగానే వేస్తోంది. దీంతో కామెడీ షోలు కాస్త… సైడ్ ట్రాక్ పడుతున్నట్లు కనపడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటికి తోడు నాగబాబు షో జబర్దస్త్‌ను మించలేకపోతుందని, ముఖ్యంగా అనసూయ-రష్మీలు లేని లోటు అదిరిందిలో స్పష్టంగా కనపడుతుందని సోషల్ మీడియాలో టాక్ వినపడుతోంది.