మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అమ్మలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి తన తల్లికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురు తన మాతృమూర్తితో గడిపిన మూమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
గతంలో చాలా సార్లు తన అమ్మతో ఆనందంగా ఉన్న క్షణాలని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక ఈ వీడియోలో మెగా బ్రదర్స్ ముగ్గురు షూటింగ్ స్పాట్‌లో ఉండగా.. అంజనా దేవి అక్కడికి వెళ్లారు. ముగ్గురు కొడుకులతో కలిసి భోజనం చేసిన అంజనా దేవి..ఆ తరువాత సరదాగా నలుగురు కలిసి కబుర్లు చెప్పుకున్నారు.
అనంతరం అంజనా దేవిని దగ్గరుండి కారెక్కించి ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా నలుగురు కలిసి దిగిన కొన్ని ఫోటోలను వీడియోకి యాడ్ చేశారు. ఈ సందర్భంగా అమ్మలందరికీ అభివందనములు. మాతృ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అని చిరంజీవి పేర్కొన్నారు.
మెగా బ్రదర్స్‌ని ఒకేసారి చూడటంతో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఇంటికి పెద్ద కుమారుడంటే మీలా ఉండాలంటూ చిరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేర్ వీరయ్య’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022