పోలవరం హెడ్‌వర్క్స్, పవర్ హౌస్ రీ టెండర్లను తెరిచిన అధికారులు – ప్రభుత్వ ఖజానాకు రూ. 780 కోట్లు ఆదా
ముఖ్యమైన అంశాలు:
– పోలవరం రీటెండర్లలో ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్ల రూపాయల ఆదా
– పోలవరం హెడ్ వర్క్స్, గేట్ల నిర్మాణం సహా పవర్‌హౌస్ నిర్మాణానికి ఏపీ జెన్‌కోతో కలిసి జలవనరులశాఖ టెండర్లు, ఆగష్టు 17న బిడ్ డాక్యుమెంట్ అప్‌లోడ్
– పోలవరం హెడ్ వర్క్స్ మెయిన్ డ్యామ్ ప్యాకేజీ పనుల విలువ 1771.44 కోట్ల రూపాయలు. 24 నెలల కాల వ్యవధిలో ఈపనులు పూర్తి చేయాలని షరతు
– హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు పనుల విలువ 3216.11కోట్ల రూపాయలు.. 58 నెలల్లో పనులు పూర్తి చేయాలని షరతు.
– సెప్టెంబరు 21 వరకు టెండర్లు స్వీకరించిన జలవనరులుశాఖ. బిడ్ దాఖలు చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.
– ఇవాళ మధ్యాహ్నం 1ః45 నిమిషాలకు బిడ్ తెరిచిన అధికారులు
– ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువ 4987.55 కోట్లకు గాను 4359.11 కోట్లకు పనులు చేస్తానంటూ మందుకొచ్చిన మేఘా.
–12.6 శాతం తక్కువకు పనులు చేస్తానంటూ ముందుకొచ్చిన మేఘా. దీనివల్ల రూ. 628.43 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా
– హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు రీ టెండర్ వల్ల అదనంగా మరో 152 కోట్ల రూపాయలు ఆదా.
–గతంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఇనీషియల్ బెంచ్ మార్కు విలువ 3157 కోట్లు. 4.8 శాతం ఎక్కువ ధరకు అప్పగించిన గత ప్రభుత్వం. ఈ ఎక్సెస్ వల్ల ఖజానాకు 152 కోట్ల రూపాయలు అదనపు భారం.
–ప్రస్తుతం హెడ్‌వర్క్స్, గేట్ల నిర్మాణం రీటెండరింగ్ ద్వారా 223 కోట్ల రూపాయలు, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు రీటెండరింగ్ ద్వారా 557 కోట్ల రూపాయల ప్రజాధనం… మొత్తంగా 780 కోట్ల రూపాయలు ఖజానాకు మిగులు
– ఇనీషియల్ బెంచ్ మార్కు కంటే తక్కువ ధరకే కోట్ చేసిన మేఘా కంపెనీకి ప్రాజెక్టు వర్కులు కేటాయించడం సరైనదేనంటూ జలవనరుల శాఖకు తెలిపిన పోలవరం చీఫ్ ఇంజనీర్.
– అక్టోబరు 1లోగా పూర్తికానున్న టెక్నికల్, కమర్షియల్ క్వాలిఫికేషన్ క్రైటీరియాపై రివ్యూ.
– పోలవరం 65వ ప్యాకేజీలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియద్వారా రూ.58.53 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా.