రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు నెవ్వర్ బిఫోర్ అన్నట్టుగా సాగాయి. టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లో సోమవారం రాత్రి దర్శనం ఇచ్చింది. అయితే రామ్ చరణ్‌తో సహా ఉపాసన జంటగా కనిపించింది. ఈ వేడుకల్లో ఉపాసన బేబీ బంప్ క్లియర్‌గా దర్శనం ఇచ్చింది. ఉపసాన గర్భం దాల్చడం మీద ఎన్ని రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే.
అసలే రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారంటూ మెగా అభిమానులు గత దశాబ్దకాలం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక వీరికి ఏమైనా సమస్య ఉందా? అందుకు పిల్లలు పుట్టడం లేదా? అంటూ ఇలా రకరకాల కామెంట్లు వచ్చాయి. దీనిపై పలుమార్లు ఉపాసన సీరియస్ కూడా అయింది. అయితే ఉపాసన మాత్రం టైం వచ్చినప్పుడు అవన్నీ మీకు చెబుతామని, అవన్నీ మా పర్సనల్ అని చెబుతూ వచ్చేది.
ఇక గతేడాది చివర్లో చిరంజీవీ ఈ శుభవార్తను చెప్పాడు. మెగా ఇంట్లోకి వారసుడు రాబోతోన్నాడని, ఆ ఆంజనేయుడి దీవెనలతో వారసుడు రాబోతోన్నాడని, రామ్ చరణ్ తండ్రి కానున్నాడని, ఉపాసన గర్భం దాల్చిందనే తియ్యని వార్తను చిరంజీవి షేర్ చేసి తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అలా క్షణాల్లో ఉపాసన రామ్ చరణ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఉపాసనది సహజ గర్భం కాదని, అద్దె గర్భమని, సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారంటూ రూమర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఉపాసన బేబీ బంప్ సరిగ్గా కనిపించకపోవడంతో ఈ రూమర్లే నిజమని అంతా అనుకున్నారు. ఉపాసన గర్భంతో ఉన్నా కూడా ఫార్మూలా ఈ రేస్ చూసేందుకు వచ్చింది.. రామ్ చరణ్‌తో కలిసి ఆస్కార్ వేడుకలకు వెళ్లింది. ఈ టైంలోనే తన డెలివరీ సంగతులు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. తనకు ఎవరు డెలివరీ చేస్తారో కూడా చెప్పేసింది.
ఇక ఇప్పుడు ఇలా బేబీ బంప్‌తో క్లియర్‌గా కనిపించే సరికి అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఇక త్వరలోనే బుల్లి రామ్ చరణ్ వస్తాడని మెగా అభిమానులు తెగ సంబరపడుతున్నారు. మొత్తానికి రామ్ చరణ్‌కు ఇప్పుడు మంచి దశ, యోగం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా రామ్ చరణ్ పేరు వినిపిస్తోంది. కనిపిస్తోంది. లోకల్ టు గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్ పేరు మార్మోగిపోతోంది.