మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం చప్పుడు లేకుండా జరిగిపోయియింది. సోషల్ మీడియా వేదికగా తాను పెళ్లి చేసుకునే వాడు అంటూ పరిచయం చేసింది. గుంటూరు ఐజీ రేంజ్ కొడుకు చైతన్య తో నిహారిక వివాహాన్ని పెద్దలు కుదిర్చారు.కాగా డిసెంబర్ లో వివాహం జరుగబోతుందని కూడా నాగబాబు కూడా చెప్పేశారు. అయితే ఎంగేజ్మెంట్ పెళ్లి ఎప్పుడు ఎప్పుడు అంటూ మెగా అభిమానులు ఆలోచిస్తున్న సమయంలోనే సడన్ గా నిహారిక ఎంగేజ్మెంట్ ను ఎవ్వరికి తెలియకుండా జరిపించేశారు. కాగా ఈ వేడుకకు అల్లుఅర్జున్, సాయిధరమ్ తేజ్, చిరంజీవితో పాటు రాంచరణ్, ఇలా కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ రాలేదు.