మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య చిత్రానికి సంబంధించి శుక్రవారం టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. అదేవిధంగా టీజర్ పై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా డాటర్ నిహారిక ఆచార్య రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మే 13 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది.
ఇక మెగా అభిమానులు అందరూ మేము కూడా ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల గుంటూరు కు చెందిన చైతన్య ను నిహారిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.