కొణిదెల వారి కూతురు మెట్టినింట అడుగుపెట్టింది. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ జంట ఒక్కటైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి వివాహం రాత్రి 7.15 గంటలకి అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్‌విలాస్ ప్యాలెస్ వేదికగా… మెగా కుటుంబం, ఇరు కుటుంబాల సన్నిహితుల సమక్షంలో కొత్త జంట ఏడడుగులు వేసింది.
మూడు రోజులుగా ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో మెగా మ్యారేజ్ సందడే నెలకొంది. వివాహానికి ముందు కొత్త జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా పవన్‌కల్యాణ్, ఆయన తనయుడు అకీరా ఫోటోలను చూసి మెగా అభిమానులు ఖుషీ అయ్యారు.