కొణిదెల కుటుంబ గౌరవం ఏమవుతుంది? మన ఇంటి ఆడపిల్ల స్క్రీన్ మీదకు వెళ్ళడానికి వీలులేదు ! ఇప్పుడు నటించి ఎవరిని ఉద్దరించాలి? ఇలా ఇంట్లోనే ఎంతో వ్యతిరేకత ఉన్నా కానీ.. నాగబాబు తన కూతురు ఇష్టానికి తలవంచాడు. ఐతే, కుటుంబ పెద్దలకు ఎక్కడ అశ్లీలత లేకుండా, పొందికగా, చక్కగా ఉన్న సినిమాలలోనే నిహారిక కనిపిస్తుందని నచ్చచెప్పారట. ఆ మాట మీదే నిహారిక కూడా ‘డీసెంట్’ గా ఉండడానికి ట్రై చేస్తూ వచ్చింది.
కానీ, మూడేళ్లు అయినా పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఇంటి పేరు సరిపోదు, గ్లామర్ తప్పకుండా కావాలి, అని నిహారిక ఫిక్స్ అయినట్టుంది. ఫైనల్‌గా లుక్ మార్చింది. డోస్ పెంచింది.
మొన్న జరిగిన సినీ ఫంక్షన్‌లో చీరలో జనం షాక్ అయ్యేలా కొత్త నిహారిక కనిపించింది. ఇప్పుడు తన సోషల్ మీడియా పేజీలో ఫుల్ గ్లామర్ ఒలకపొసింది. “నువ్వు కూడా మొదలెట్టేశావా”, “ఫస్ట్ టైం క్లీవేజ్ ఫోటో పెట్టావు, ఇంట్లో వాళ్ళకి తెలుసా?”, “సర్జరీ ఏదో చేయించుకున్నట్టున్నావు”, లాంటి కామెంట్లు తెగ వస్తున్నాయి.”చాలా బాధ పడుతున్నాము”, అని ఒకరంటే, “ఒకే సరే”, అంటూ నిహారిక రిప్లై కూడా ఇచ్చింది.
ముంబైకి చెందిన సయాలి విద్య అనే స్టైలిస్ట్‌ను నిహారిక పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జనం ఏమనుకున్నా, తెగ ఫోటో షూట్స్‌తో “నిహారిక చాలా హాట్ గురూ…” అని చెప్పించుకునే పనిలో ప్రస్తుతానికి బిజీగా వున్నట్లనిపిస్తోంది.