మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు ప్రభాకర్ కుమారుడు చైతన్యను నిహారిక వివాహం చేసుకోబోతోంది. డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. రాజస్థాన్ ఉదయపూర్ లోని ఉదయ విలాస్ లో చైతన్య నిహారికల పెళ్లి జరగబోతుంది.
అయితే నిహారిక పెళ్లి కి సంబంధించి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లికి హాజరు కానున్నారు. ఇక రిసెప్షన్ 11వ తేదీన హైదరాబాద్ లోని వి.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన నిహారిక ఆ తరువాత సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో సినిమాలకు చెక్ పెట్టింది నిహారిక.