కొణిదెల వారి కుటుంబానికి చెందిన ఇద్దరు లేడీస్ ‘సైరా’ రిలీజ్ రోజున వార్తల్లో నిలిచారు.
అందులో ఫస్ట్ లేడీ కొణిదెల వారి కోడలు ఉపాశన. సైరా ప్రొడ్యూసర్ రామ్‌చరణ్‌తేజ్ బెటర్‌హాఫ్‌గా వున్న ఉపాశన కొణిదెల మొదటి నుంచి చెర్రీకి ఈ ప్రాజెక్టులో చేదోడు వాదోడుగా వుంటోంది. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్టును కొడుకు నెరవర్చే క్రమంలో కోడలు కూడా ఇతోధికంగా హెల్ప్ చేసింది. ముఖ్యంగా తన సోషల్ మీడియా వేదికల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహించింది. సైరా రిలీజ్ సందర్భంగా ఫాన్స్ ఎక్కడెక్కడ సంబరాలు చేసుకుంటున్నారో చూసి ఆ వీడియోలన్నీ తీసి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 70 అడుగుల సైరా కటౌట్‌ను తన మామగారి అభిమానులు ఏర్పాటు చేసినట్టు ఈమె ద్వారానే లోకానికి తెలిసింది. లవ్లీ బెజవాడ బీట్ అంటూ విజయవాడలో మెగా ఫాన్స్ సంబరాల్ని విజువలైజ్ చేసి ట్విట్టర్‌లో వుంచింది. ఆ ట్వీట్ కింద ఫాలో అవ్వచ్చు..
ఇక కొణిదెల వారి అమ్మాయి నీహారిక గురించి మరో ఇంట్రస్టింగ్ టాపిక్ ప్రస్తుతం మెగాభిమానుల చర్చల్లో ఉంది. నీహారిక తన పెదనాన్న మూవీలో ఒక కేరక్టర్ చేయడమే ఆ టాపిక్. కాకపోతే.. నీహారిక గొప్పగా చెప్పుకుంటున్నట్టు, మెగా శిబిరం ప్రచారం చేసినట్టు ఇందులో ఆమె క్యారెక్టర్ బ్రహ్మాండం బద్దలయ్యేంతగా ఏమీ లేదు.
ఇందులో ఆమెది మాటల్లేని ఓ సైడ్ క్యారెక్టర్. సైరా నరసింహారెడ్డి బ్రిటీష్ వారిని ఎదిరించే సన్నివేశంలో గుంపులో గోవిందమ్మలా ఓ పక్క నిలబడి వుండే కేరక్టర్. బ్రిటీష్ వాళ్లు గిరిజన యువతుల్ని హెచ్చరిస్తూ.. మీరు ఎవరినైనా పెళ్లిళ్లు చేసుకోండి.. శోభనాలు మాత్రం మాతోనే.. అంటూ సీ గ్రేడ్ తరహా పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ మధ్య ఆమెని చూపించారు. అంతే..
నీహారిక భుజాలెగరేసే రేంజ్‌లో, లేదా చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో వున్న కేరక్టర్ అయితే కాదు. నాగబాబు ఫీలవుతాడని అమ్మాయి కోరిక తీర్చడానికా అన్నట్టు పెట్టారు కానీ, ఆ కేరక్టర్‌ను ఎలివేట్ చేయాలనే ఉద్దేశం మాత్రం చిత్రంలో కనిపించలేదు.
Loveeeeee the #bezawada beat ! #SyeRaaNarsimhaReddy #Euphoria #SyeRaa #RamCharan pic.twitter.com/WsznnrRjKO
— Upasana Konidela (@upasanakonidela) October 2, 2019